హైదరాబాద్: 28°C
వార్తలు

శీష్‌ మహల్‌ సందర్శనకు మీడియాకు అనుమతి

ఢిల్లీలోని రేఖా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేజ్రీవాల్ నివాసంగా పేర్కొనే శీష్ మహల్‌లో మీడియా ప్రతినిధులు సందర్శించేందుకు అనుమతినిచ్చింది. ప్రజాధనం ఖర్చు వివరాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తొలుత మీడియాకు అనుమతి ఇస్తున్నట్లు మంత్రి పర్వేశ్ వర్మ వెల్లడించారు. తర్వలో సాధారణ పౌరులకు టికెట్ల ద్వారా సందర్శనకు వీలు కల్పిస్తామని చెప్పారు.