హైదరాబాద్: 28°C
వార్తలు

గుజరాత్‌ వడోదరాలో జైషే ఉగ్రవాది అరెస్ట్‌

గుజరాత్ వడోదరాలో జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాదిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వడోదరా బస్ స్టాండ్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఏకే-47 రైఫిల్‌తో పాటు 23 తుటాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అసోం నుంచి వచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.