హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడులో మరో ఎమ్మెల్యేపై కేసు నమోదు

తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే వసంతం కార్తికేయన్‌పై కేసు నమోదైంది. తనను ఎమ్మెల్యే బెదిరించటంతో పాటు వేధించారంటూ గ్రామీణ జీవనోపాధి మిషన్‌కు చెందిన ఓ సీనియర్ మహిళా అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు FIR నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కింద ఓ ఉద్యోగి నియామకం విషయమై OCT 18న రాత్రి ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.