GNTR: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే దుగ్గిరాల ఉద్యోగులకు ఈనెల 29న పోస్టల్ బ్యాలెట్ వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మండల పరిషత్తు కార్యాలయంలో కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధుల నియామక పత్రం, ఆధార్, ఓటరు కార్డులు తెచ్చుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగులకు ఈనెల 29న పోస్టల్ బ్యాలట్


