హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టి కృషి

VSP: బాల్య వివాహాలు సామాజిక దురాచారమని, వీటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షురాలు విశాలాక్షి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాల్య వివాహాల నిరోధక దినోత్సవం సందర్భంగా ఫిషింగ్ హార్బర్‌లోని బాల వికాస ఫౌండేషన్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. 2030 నాటికి బాల్య వివాహాలు లేని సమాజం నిర్మించాలని వక్తలు కోరారు.