హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రాలో సర్పంచ్‌గా గెలిచిన వైసీపీ మద్దతుదారు

అనకాపల్లి: బుచ్చయ్యపేట మండలంలో నీలకంఠాపురంలో వైసీపీ బలపరిచిన సిరిసోల్ల రమణమ్మను అదృష్టం వరించింది. రమణమ్మకు, ఆమె సమీప ప్రత్యర్థి టీడీపీ బలపరిచిన కోట నాగలక్ష్మికి చెరో 281 ఓట్లు వచ్చాయి. ఇరువురు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో అధికారులు డ్రా తీశారు. డ్రాలో రమణమ్మ గెలుపొందారు. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.