హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఐదేళ్లలో ఏఐతో 2.4 కోట్ల ఉద్యోగాలకు ముప్పు

ఏఐతో ప్రపంచ వ్యాప్తంగా రానున్న ఐదేళ్లలో 2.4 కోట్ల నాలెడ్జ్-వర్కర్స్ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ వెల్త్ మేనేజ్‌మెంట్ నివేదిక అంచనా వేసింది. అయితే ఇందులో లేఆఫ్‌ల కంటే ఖాళీ పోస్టులే ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్, డేటా, రైటింగ్ తదితర ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, అమెరికాలోనే ఉద్యోగ ముప్పు అధికంగా ఉంటుందని పేర్కొంది.