కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం టౌన్ సర్పంచ్‌గా కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి కాసర్నేని రంగబాబు విజయం సాధించారు. 1,300 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిపై గెలుపొందారు. మొత్తం 20 వార్డులకు గాను కూటమి అభ్యర్థులు 14 వార్డులను కైవసం చేసుకున్నారు. దీంతో గన్నవరం టౌన్‌లో కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ గెలుపుతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్
గన్నవరం సర్పంచ్‌గా రంగబాబు


