హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఛైర్మన్ క్షేత్రస్థాయి పర్యటన

PLD: సత్తెనపల్లి 29, 32వ వార్డులలో శుక్రవారం ఉదయం మున్సిపల్ ఛైర్మన్ మారెళ్ళ రామాంజనేయులు పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఏఈ, టౌన్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, కౌన్సిలర్ షాహినా సుల్తానా బాషు పాల్గొన్నారు.