హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిచ్చాటూరులో రెండు రోజులుగా అనాథ శవం

TPT: పిచ్చాటూరు మండల కేంద్రంలోని దురైవేలు రెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా, మెకానిక్ షాప్ పక్కన మెయిన్ రోడ్డు ఆనుకొని ఓ అనాథ శవం పడి ఉంది. రెండు రోజులుగా మృతదేహం అక్కడే పడి ఉన్నా పంచాయతీ అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులు స్పందించి జన సంచార ప్రదేశంలో ఉన్న మృతదేహాన్ని తరలించాలని కోరుతున్నారు.