VSP:సింహాచలంలో మాలాధారణ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గోపాలపట్నం పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. మృతుడి ఆచూకీ తెలియకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే గోపాలపట్నం పోలీసులను సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం


