హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో బోల్తా.. మహిళకు స్వల్ప గాయాలు

VSP: మల్కాపురం నుంచి డాక్యార్డ్‌కు వెళ్తున్న ఆటో ఇవాళ ఉదయం నావెల్ క్యాంటీన్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఓ మహిళకు స్వల్ప గాయాలవ్వగా, డ్రైవర్ సహా మిగతా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్సాక్ వెంటనే ఆటో తొలగించి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ఆటో డ్రైవర్ స్వామి మాలధారణ చేసి ఉన్నారని తెలిపారు.