హైదరాబాద్: 28°C
వార్తలు

చెన్నైలో భారీ వర్షం.. ప్రజలు అవస్థలు

తమిళనాడు చెన్నైలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.