ASF: కౌటాల మండలం తాటినగర్ వెళ్లే ప్రధాన రహదారిపై కంకర వేసి వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలల క్రితం తారు రోడ్డు వేయడానికి రోడ్డును చదును చేసిన గుత్తేదారు కంకర వేసి వదిలేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ రోడ్డుపై తరచు వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
కంకర రోడ్డుతో వాహనదారులకు ప్రమాదం


