కృష్ణా: మచిలీపట్నం పరిధిలోని శారదానగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు నిలిచిపోతోందని స్థానికులు వాపోతున్నారు. దీంతో దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమల బెడద పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని నివాసితులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైనేజీ సమస్యపై స్పందించని అధికారులు


