హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాళ్ల దారిలో గిరిజనుల అవస్థలు!

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం రెల్ల పంచాయతీ పరిధిలోని టిక్కబాయి, జాపాయి గిరిశిఖర గ్రామాల ప్రజలకు రహదారి కష్టాలు తప్పడం లేదు. సుమారు 5 నుంచి 7 కిలోమీటర్ల మేర రాళ్లు వేసి వదిలేయడంతో రాకపోకలు దుర్భరంగా మారాయి. వాహనాలపై వెళ్లలేక, కాలినడకన నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.