ప్రకాశం: తాళ్లూరు మండలం కొత్తపాలెంలో గురువారం రాత్రి అయ్యప్ప స్వాముల పడి భజన నిర్వహించారు. విద్యుత్ దీపాలంకరణలతో 18 మెట్ల అయ్యప్ప మందిరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అయ్యప్ప, సుబ్రహ్మణ్య, వినాయక స్వాముల చిత్రపటాలను ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప, శివ స్వాములు, భక్తులు తరలివచ్చి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొత్తపాలెంలో వైభవంగా పడి భజన


