ప్రకాశం జిల్లాలో గురువారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎనిమిది మండలాల్లోని 81 గ్రామ పంచాయతీల్లో 80.27 శాతం పోలింగ్ నమోదైంది. 1,93,022 మంది ఓటర్లలో 1,54,930 మంది ఓటేశారు. కొండపిలో అత్యధికంగా 89.06 శాతం, సింగరాయకొండలో అత్యల్పంగా 69.71 శాతం నమోదైంది. ఒంగోలు మండలంలో 83.35 శాతం పోలింగ్ జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్
81 గ్రామ పంచాయతీల్లో 80.27 శాతం పోలింగ్


