ప్రకాశం: పంచాయతీ ఎన్నికల్లో విధి నిర్వహణలో ఉన్న అధికారులు శుక్ర, శనివారాల్లో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటుహక్కును వినియోగించుకోవాలని తాళ్లూరు ఎంపీడీవో పీ. అజిత, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు సూచించారు. ఆయా గ్రామ పంచాయతీల కార్యాలయాలకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అధికారులు ఓటు హక్కును వినియోగించుకోండి'


