కర్నూలుకు చెందిన 23 ఏళ్ల యువతి కడపలో ఫిజియోథెరపీ కోర్సు చదువుతూ హాస్టల్లో ఉంటోంది. అదే కాలేజీకి చెందిన యువకుడిని ప్రేమించింది. యువకుడికి డబ్బు అవసరం కావడంతో తన అక్క నగలు ఇచ్చింది. అక్క పెళ్లి ఖరారు కావడంతో నగలు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా అతడు ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువతి హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
లవర్ మోసం చేశాడని యువతి ఆత్మహత్య


