అనకాపల్లి: సబ్బవరం మండలం మొగలిపురం పంచాయతీ ఎన్నికల్లో అత్తాకోడళ్ల మధ్య జరిగిన ఆసక్తికర పోరులో అత్త విజయం సాధించారు. వైసీపీ మద్దతు అభ్యర్థిగా బరిలోకి దిగిన అత్త గండి తులసీభవాని, తన కోడలు, టీడీపీ మద్దతు అభ్యర్థిని భాను రోషిణి నాయుడుపై 516 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నిక ఫలితం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్
కోడలిపై గెలిచిన అత్త


