ASR: జీకేవీధి పంచాయతీలో టీడీపీ నాయకుల మధ్య సమన్వయ లోపం ఆ పార్టీ ఓటమికి కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి చెందిన ఐదుగురు అభ్యర్థులకు కలిపి 1,098 ఓట్లు పోలయ్యాయి. అయితే సీపీఎం అభ్యర్థి బుజ్జిబాబు 842 ఓట్లతో విజయం సాధించారు.టీడీపీ నాయకులు పంతాలకు పోయి వేర్వేరుగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జీకేవీధిలో టీడీపీ అనైక్యత.. సీపీఎంకు విజయం


