హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి

బాపట్ల జిల్లాలో ఈ నెల 29న ఏడు మండలాల్లో జరగనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి పీఓలు, ఏపీఓలు, ఓపీఓల సిబ్బంది కేటాయింపు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది. కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకురాలు ఏఏఎల్ పద్మావతి సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించినట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.