హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి: మేయర్

అనంతపురంలోని పారిశుద్ధ్య కార్మికులను నూతన వైసీపీ మేయర్ రమేశ్ గౌడ్ కలిశారు. కార్మికులతో కలిసి టీ తాగుతూ ఆత్మీయంగా ముచ్చటించారు. వారి రోజువారీ విధులు, ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు నగర పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు ఎంతో విలువైనవని మేయర్ పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.