హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి మేయర్ వైసీపీ రెబల్ అభ్యర్థికి షాక్

E.G: రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన YCP రెబల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి అజ్జరపు వాసును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు గురువారం రాత్రి YCP కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఆదేశాల మేరకు 48వ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి కూడా తొలగించారు.