హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్లి సర్పంచ్‌గా అబ్బూరి అలివేలు విజయం

అన్నమయ్య: వీరబల్లి మండలం మట్లి గ్రామ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారు అబ్బూరి అలివేలు 275 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే మూడు వార్డులను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా అలివేలు మాట్లాడుతూ తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ తాను, తన కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.