హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బూదరాళ్ల పంచాయతీలో YCP అభ్యర్థి విజయం

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొర్ర తిరుపతిరావు విజయం సాధించారు. ఆయన 975 ఓట్లు సాధించి, సమీప స్వతంత్ర అభ్యర్థి సాగిన సంజీవ్ (634 ఓట్లు) పై 341 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సాగిన రాజారావుకు 204, బీజేపీ అభ్యర్థి కొర్ర త్రినాధ్‌కు 46 ఓట్లు పోలయ్యాయి.