హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో దొంగల ముఠా హల్‌చల్?

బాపట్లలోని ప్యాడిసన్ పేట వద్ద గల NTR కాలనీలో దొంగల ముఠా హల్‌చల్ చేస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం అర్ధరాత్రి చోరీకి వచ్చిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. కాలనీ పరిసరాల్లో నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయని, గతంలో జరిగిన దొంగతనాలకు ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదని బాధితులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కాలనీలో దొంగతనాలను అరికట్టాలని కోరుతున్నారు.