హైదరాబాద్: 28°C
వార్తలు

గోల్కొండలో చెట్టుపై విమానం ల్యాండింగ్

HYD: గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ పరిధిలో శిక్షణ విమానానికి ప్రమాదం తప్పింది. సెస్నా 152 విమానం చెట్టుపై అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఘటన సమయంలో విమానంలో ఓ క్యాడెట్, ఇన్‌స్ట్రక్టర్ ఉన్నారు. ఈ ప్రమాదంలో క్యాడెట్ తలకు గాయాలు కావడంతో ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇన్‌స్ట్రక్టర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.