TPT: విప్పమానుపట్టెడ గ్రామపంచాయతీ సర్పంచిగా జనసేన బలపరిచిన అభ్యర్థి దీన్ దయాల్ విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో తన సమీప ప్రత్యర్థిపై 122 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తనపై నమ్మకంతో ఓటు వేసిన గ్రామస్థులకు దీన్ దయాల్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అందరికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని పేర్కొన్నారు.
వార్తలు
విప్పమానుపట్టెడలో జనసేన విజయం


