హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివాహేతర సంబంధం.. భర్త హత్య

ఉమ్మడి వరంగల్ జిల్లా అయోధ్యపురంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త సారయ్యను భార్య మంజుల తన ప్రియుడు రాజుతో కలిసి హత్య చేసింది. నవంబర్ 19న రాత్రి దుప్పటితో ఊపిరాడకుండా చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో నిందితులు మంజుల, రాజులను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన దుప్పటి, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.