హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజ్యాంగ విలువలను గౌరవించాలి: గళ్ళా మాధవి

GNTR:  భారత రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ముందుకు సాగాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్, మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు గళ్ళా మాధవి, పల్లా శ్రీనివాసరావు, వర్ల రామయ్య, గణబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.