హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వడ్రవన్నూర్ గ్రామ సర్పంచ్‌గా అంగడి అశోక్ విజయం

ATP: రాయదుర్గం మండల పరిధిలోని వడ్రవన్నూర్ గ్రామ సర్పంచిగా తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచిన అంగడి అశోక్ స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేవలం 23 ఓట్ల తేడాతో అశోక్ విజయం సాధించారు. చివరి వరకు తన ప్రత్యర్థి అభ్యర్థితో హోరాహోరీగా సాగిన కౌంటింగ్ లో 23 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.