హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తవలస 12వ వార్డులో జనసేన బోణీ

VZM: కొత్తవలస 12వ వార్డు ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గురజాడ వెంకటేష్ 314 ఓట్లతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి మారడపూడి చినబాబుపై గెలుపొందారు. తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంకటేష్ తన మేనమామపై విజయం సాధించడం విశేషం. దీంతో 12వ వార్డులో జనసేన గాజు గ్లాసు గుర్తు తొలి విజయాన్ని నమోదు చేసింది.