హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం మన్యంలో వైసీపీ జోరు

పార్వతీపురం మన్యం జిల్లాలో పలు పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు స్వగ్రామం చిలకలపల్లిలో తప్పిట భారతి లక్ష్మి 1,174 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. నారాయణపురంలో ప్రసాద్ 362, జమదాలలో బంకపల్లి ఉమ 151, తాళ్లబురిడిలో మర్రపు వాసుదేవరావు 741 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.