హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో 54.1%, ఆమదాలవలసలో 75.1% పోలింగ్

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో సాయంత్రం 5 గంటల వరకు 54.1 శాతం, ఆమదాలవలస మున్సిపాలిటీలో 75.1 శాతం పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్‌లో 1,57,545 మంది ఓటర్లకు గాను 85,213 మంది ఓటు వేశారు. ఆమదాలవలసలో 33,067 మందికి గాను 24,828 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో 180, ఆమదాలవలసలో 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.