హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ మేయర్ల సదస్సులో కర్నూలు మేయర్, కమిషనర్

KRNL: ముంబైలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న 3వ ప్రపంచ మేయర్ల సదస్సులో కర్నూలు మేయర్ బొల్లెద్దుల విజయ ప్రత్యూష, కమిషనర్ చల్లా ఓబులేసు పాల్గొన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ సదస్సును ప్రారంభించారు. 2047 నాటికి నగరాల అభివృద్ధి, ఏఐ ఆధారిత పట్టణ పాలన, పారిశుద్ధ్యంపై చర్చించారు. పర్యావరణ పరిరక్షణ, ఆధునిక రవాణా వ్యవస్థలపై కూడా సమావేశంలో చర్చలు జరిగాయి.