హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్: భారత్‌కు బిగ్ షాక్ తప్పదా?

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ సెమీఫైనల్లో శ్రీలంక-A, భారత్-Aకు గట్టి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు ధీటుగా బదులిస్తోంది. కేవలం 14 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 127 పరుగులు చేసింది. ఓపెనర్లు సినెత్ జయవర్ధన(73*), లాసిత్(48*) ఓవర్‌కు 9కి పైగా రన్ రేట్‌తో చెలరేగుతున్నారు. లంక విజయానికి ఇంకా 36 ఓవర్లలో 191 పరుగులు కావాలి.