హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs NZ: రెండో టెస్టుకు వర్షం ముప్పు!

రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఇవాళ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా అకస్మాత్తుగా వర్షం కురవడంతో సెషన్ నిలిచిపోయింది. మ్యాచ్ జరిగే తొలి మూడు రోజులు వరుణుడి ముప్పు లేదని సమాచారం. అయితే, చివరి రెండు రోజులు మాత్రం వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే మ్యాచ్ రోజుల్లో చల్లటి గాలులు వీయనున్నాయి.