హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోషాసుపత్రికి గీజర్ అందజేత

VZM: విజయనగరం ప్రభుత్వ ఘోషాసుపత్రిలో వేడినీటి సదుపాయం లేక బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న మేయర్ అభ్యర్థి డాక్టర్ స్పర్శ చౌదరి, శ్రీకాంత్ దంపతులు స్పందించారు. మానవతా దృక్పథంతో ఆసుపత్రికి గీజర్‌ను అందజేశారు. రోగులకు తమ వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.