హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో మహిళా ఓటర్లదే అధికం

W.G: జిల్లా తణుకు మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల పోలింగ్ శాతం 63.28 కాగా, మహిళల పోలింగ్ 64.72 శాతంగా నమోదైంది. మొత్తం 44 వార్డులకు గాను 27 వార్డుల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటు వేశారు. మహిళా ఓటర్ల భాగస్వామ్యం ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచింది.