హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవనకొండలో మూడు పంచాయతీలు ఏకగ్రీవం

KRNL: దేవనకొండ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. గుండ్లకొండలో ఈడిగ లక్ష్మి, నేలతలమర్రిలో ఈడిగ నాగరాజు, పల్లెదొడ్డిలో బోయ కౌలుట్లమ్మ కూటమి టీడీపీ అభ్యర్థులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మరో 23 స్థానాలకు పోటీ జరుగుతోంది. మిగిలిన పంచాయతీల్లో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది.