అన్నమయ్య: బి. కోడూరు మండలం తుమ్మలపల్లి పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కమలాపురం సుధాకర్ ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో తన సమీప ప్రత్యర్థిపై 271 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో వైసీపీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. తుమ్మలపల్లిలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ అభ్యర్థి ఘన విజయం


