VSP: చేపల వేటకు వెళ్లి గల్లంతైన గరికిన సింహాద్రికి చెందిన ఫిషింగ్ బోటు ఆచూకీ లభ్యమైంది. అందులోని ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నారు. గేర్‌బాక్స్ బేరింగులు దెబ్బతినడం, ట్రాన్స్‌పాండర్ పనిచేయకపోవడంతో సంబంధాలు తెగిపోయాయి. కాకినాడకు 30 మైళ్ల దూరంలో ఫోన్ సిగ్నల్ అందడంతో వారి ఆచూకీ తెలిసిందని బోటు యజమానుల సంఘం అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గల్లంతైన బోటు ఆచూకీ లభ్యం


