VZM: విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీ దామోదర్తో కలిసి గురువారం రామభద్రపురం మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. పోలింగ్ సరళి, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల భద్రత కోసం నలుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 150 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల బందోబస్తుపై ఐజీ పరిశీలన


