హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కావలిలో ఛైర్మన్ అభ్యర్థి, సీఐ మధ్య వాగ్వాదం

NLR: కావలి వెంగళరావునగర్ 32వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద కూటమి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్, సీఐ మధ్య వాగ్వాదం జరిగింది. ఓటింగ్ సమయం ఉండగానే గేట్లు ఎందుకు మూసివేశారని భరత్ కుమార్ ప్రశ్నించడంతో వివాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.