హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీవీఎంసీ టాక్స్ మేళాకు 803 దరఖాస్తులు!

VSP: జీవీఎంసీ పరిధిలో నవంబర్ 24 నుంచి 26 వరకు నిర్వహించిన ప్రత్యేక రెవెన్యూ టాక్స్ మేళాలకు 803 దరఖాస్తులు అందినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. మొదటి రోజు 93, రెండో రోజు 394, మూడో రోజు 316 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో యజమాని పేరు మార్పునకు 229, జనరల్ రివిజన్‌కు 168, కొత్త అసెస్‌మెంట్లకు 142 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు.