హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్వాలలో భారీ ఇత్తెమాకు ఏర్పాట్లు ముమ్మరం

గద్వాలలోని నూరీ మస్జీద్ 28 ఎకరాల స్థలంలో డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో భారీ ఇత్తెమా నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి 70–80 వేల మంది హాజరుకానున్నట్లు అంచనా. ఏర్పాట్లను గురువారం మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త నరసింహులు, వైస్ ఛైర్మన్ శంకర్, మైనారిటీ నాయకులు పరిశీలించారు.