హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొఠియా గ్రామాల్లో ఎన్నికల సందడి కరువు

PPM: సాలూరు పరిధిలోని కొఠియా వివాదాస్పద గ్రామాల్లో ఎన్నికల వాతావరణం కనిపించడం లేదు. గంజాయిభద్ర, పగులు చెన్నూరు, పట్టుచెన్నూరు పంచాయతీల్లో సర్పంచి, వార్డు పదవులకు పలువురు నామినేషన్లు వేసినా.. ఇటీవల ఒడిశా పోలీసులు పది మందిని అరెస్టు చేయడంతో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఇళ్లకే పరిమితమయ్యారు. గ్రామాల్లో ఒడిశా పోలీసుల తనిఖీలు, నిఘా కొనసాగుతుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి.