NLR: సంగం తరుణవాయి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చి నుంచి నంద్యాల వెళ్తున్న కారు, అనంతసాగరం నుంచి నెల్లూరు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రెండు కార్లు ఢీ ముగ్గురికి గాయాలు


